ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు ప్రసవం పొందండి:స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వాసవి  

చింతపల్లి,పెన్ పవర్ మే 9:- ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు విధిగా ప్రసవం పొందాలని స్త్రీవైద్య నిపుణులు డాక్టర్ ఎస్.వాసవి అన్నారు.శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రధాన మంత్రి సురక్షిత మంత్రిత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 190మంది గర్భిణులకు స్త్రీ వైద్యనిపుణులు వైద్యపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేశారు. ఈసందర్భంగా స్త్రీ వైద్యనిపుణురాలు మాట్లాడుతూ గర్భిణులు తొమ్మిది నెలల్లో ఒక్కసారైన స్కానింగ్ చేయించుకోవాలన్నారు. స్కానింగ్ చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన ప్రసవాలను ముందుగా గుర్తించవచ్చునన్నారు.గర్భిణులు క్రమంగా ఆరోగ్య తనిఖీలు చేయించుకుంటూ పోషకాహారం తీసుకోవాలన్నారు. పురిటి నొప్పులు ప్రారంభమైన తరువాత ఆస్పత్రికి తరలించడం కంటే గర్భిణులు ప్రసవ సమయానికి పది రోజులు ముందుగా చింతపల్లి గర్భిణుల వసతి గృహంలో చేరాలన్నారు. గర్భిణులకు వసతి గృహంలో పూర్తి స్థాయిలు సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గర్భిణులు, సహాయకులకు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.ప్రతి గర్భిణీ వసతి గృహం సేవలను సంద్వినియోగం చేసుకోవాలన్నారు.గృహాల్లో ప్రసవం పొందడం తల్లిబిడ్డ ఆరోగ్యానికి సురక్షితం కాదన్నారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా ప్రియాంక పాల్గొన్నా

IMG-20250509-WA1039 రు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.