జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల ఐడి కార్డ్స్ పంపిణీ:జనసేన నాయకులు గొర్లె వీరవెంకట్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే01:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని దామనపల్లి పంచాయతీలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడెం కొత్తవీధి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 700 కి పైగా చేశామని ఒక్క దామనపల్లి పంచాయతీలో అధికంగా యువత 50 మందికి పైగా క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకోవడం జరిగిందని, క్రియాశీలక సభ్యత్వాలు పొందిన ప్రతి జన సైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఎటువంటి ఆపద సమయంలోనైనా ఐదు లక్షల బీమా సౌకర్యంతో పాటు జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ అండదండలు ప్రతి జన సైనికుడికి, ప్రతి వీర మహిళల కుటుంబాలకు ఉంటుందని వీరవెంకట్ తెలిపారు.జనసేన పార్టీ తక్కువ సమయంలో బలోపేతంతో పాటు రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులమై మండలంలో ప్రతి పంచాయతీ నుండి ఉత్సాహంతో జనసేన పార్టీ తరఫున యువత పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూటమిలో భాగంగా అధిక సీట్లు కేటాయిస్తే కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ముద్ర వేసి జనసేన పార్టీ మార్క్ చూపిస్తామని గొర్లె వీరవెంకట్ ధీమ వ్యక్తం చేశారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.