ఫేషియల్ అటెండెన్స్ దుర్వినియోగం – డ్యూటీలకు డుమ్మా కొడుతున్న అధికారులపై చర్యలకు డిమాండ్

పాడేరు,పెన్ పవర్,ఆగస్టు 14:

పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు విధులకు డుమ్మా కొడుతూ, ట్రైనింగ్ విద్యార్థుల సాయంతో తమ స్థానంలో ఫేషియల్ అటెండెన్స్ (ముఖ హాజరు) వేయిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మోసం చేస్తున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

పెదబయలు, చింతపల్లి, జిమాడుగుల (బంధ వీధి) మండలాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. అక్కడి పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు ఒక LSA అధికారి, ట్రైనింగ్ విద్యార్థులతో కలిసి తాము హాజరైనట్లు ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయించుకుంటూ, వాస్తవానికి డ్యూటీకి హాజరు కాకుండానే అధికార బాద్యతలకీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

 

గత మూడు వారాల క్రితం ట్రాన్స్ఫర్ అయిన జిమాడుగుల (బంధ వీధి) LSA అధికారి, మరియు పెదబయలు శాఖలోని ఒక క్రింది స్థాయి ఉద్యోగి ఇలా కొత్త పద్ధతిలో హాజరు నమోదు చేసిన ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడు రాధాకృష్ణ డిమాండ్ చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇలాంటి క్రమశిక్షణలేని చర్యల వల్ల ప్రజలకు నష్టమూ, ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో అవిశ్వాసం పెరుగుతుంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణం. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, శాఖలో భద్రతా పద్ధతులను పునరుద్ధరించాలి” అని ఆయన కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత శాఖాధికారులను ఈ విషయాన్ని గమనించి, విచారణ జరిపి, తప్పు చేసిన అధికారులపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ IMG-20250814-WA0551  చేశారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.