కూల్చేసిన అక్రమ షెడ్డుకు..! విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్..
*అధికారులకు చెప్పుకోవడానికో సాకు దొరికితే చాలు..! పొంతన లేని సమాధానం చెప్పడం కొత్తేమి కాదు.. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారంలో దుండిగల్ రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య.. బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో, అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ మతీన్, ఏడాది దాటినా చర్యల ఊసేలేదు.. రెండుసార్లు మొక్కుబడిగా పాక్షిక చర్యలతో మమాః అనిపించి ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు ఉండగా..! ఇప్పుడు పై అధికారులను కూడా మేనేజ్ చేసి, చర్యలు లేకుండా సైలెంట్ అయ్యారని సమాచారం..! ఇదే తరహాలో గాగిల్లాపూర్ భూదాన్ భూమిలోని అక్రమ షెడ్డు వ్యవహారంలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. అందుకు సాక్ష్యమే ఈ పాక్షిక కూల్చివేతల షెడ్డు..! రెవెన్యూ కూల్చేసిన అరకొర చర్యలకు విద్యుత్ శాఖ చేతివాటం తోడై..! అక్రమంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పలు విమర్శలకు దారితీస్తుంది..**అధికారులకు చెప్పుకోవడానికో సాకు దొరికితే చాలు..! పొంతన లేని సమాధానం చెప్పడం కొత్తేమి కాదు.. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారంలో దుండిగల్ రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య.. బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో, అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ మతీన్, ఏడాది దాటినా చర్యల ఊసేలేదు.. రెండుసార్లు మొక్కుబడిగా పాక్షిక చర్యలతో మమాః అనిపించి ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు ఉండగా..! ఇప్పుడు పై అధికారులను కూడా మేనేజ్ చేసి, చర్యలు లేకుండా సైలెంట్ అయ్యారని సమాచారం..! ఇదే తరహాలో గాగిల్లాపూర్ భూదాన్ భూమిలోని అక్రమ షెడ్డు వ్యవహారంలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి.. అందుకు సాక్ష్యమే ఈ పాక్షిక కూల్చివేతల షెడ్డు..! రెవెన్యూ కూల్చేసిన అరకొర చర్యలకు విద్యుత్ శాఖ చేతివాటం తోడై..! అక్రమంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పలు విమర్శలకు దారితీస్తుంది..*
మొక్కుబడిగా రెవెన్యూ చర్యలు..!విద్యుత్ అధికారుల ట్రాన్స్‌ఫార్మర్.. #*
*గాగిల్లాపూర్ భూదాన్ భూమిలో అక్రమార్కులకు అండగా అధికారులు..!*
*అక్రమ షెడ్డుపై రెవెన్యూ ఉదాసీనత..! మొక్కుబడిగా పాక్షిక చర్యలు..*
*రెవెన్యూ పాక్షికంగా కూల్చేసిన షెడ్డుకు..! గుడ్డిగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్..*
*కళ్ళులేని కబోదిలా వ్యవహరిస్తున్న టిజిఎస్‌పిడిసిఎల్ యంత్రాంగం..*
*కూల్చేసిన అక్రమ షెడ్డుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎలా సాధ్యం..?*
*నిర్మాణం ఉంటేచాలు కరెంటు ఇస్తామని చెబుతున్న విద్యుత్ అధికారులు..*
*అవగాహనా రాహిత్యమా..? అధికారుల సమాధానం దేనికి సంకేతం..!*
*రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా..! కాలయాపన..!*
*నిబంధనలకు పాతరేసి..! నిధులు సమకూర్చుకోవడంలో నిమగ్నం..?*
*మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 17:*
రోజురోజుకు అధికారుల విధుల్లో పారదర్శకత మచ్చుకు కూడా కనిపించటం లేదు.. మరోవైపు శాఖల సమన్వయ లేమితో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ ఉదాసీనతతో వ్యవహరిస్తుండగా..! విద్యుత్ శాఖ తానా తందాన అంటూ, అవగాహనా రాహిత్యంతో అక్రమ విద్యుత్ కనెక్షన్‌లు, వక్రమార్గంలో ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు పలు విమర్శలకు తావిస్తోంది.. ఈ వ్యవహారంలో రూ. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు వక్రమార్గంలో క్రమబద్ధీకరణ అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.. గతంలోనే అక్రమ నిర్మాణాలు అరికట్టడంలో జీహెచ్ఎంసి, మున్సిపల్ యంత్రాంగం విఫలం అవుతుందని, వెంటనే సరిచేసుకోవాలని, తెలంగాణ హైకోర్టు పలుమార్లు వ్యాఖ్యలు చేసినా..! అధికారుల్లో మార్పు కనిపించడం లేదు..! తాజాగా "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదని తెలంగాణ హైకోర్టు "టిజిఎస్‌పిడిసిఎల్"కి సూచించింది.. నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తిచేసుకుని, చట్టబద్దంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌కు తెలంగాణ ఉన్నత న్యాయస్థనం స్పష్టంచేసింది..
*ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై.. అధికారుల పరాచకాలు..*
ప్రభుత్వ భూములు, భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యమే వహిస్తున్నారో..! నిధులు సమకూర్చు కుంటున్నారో తెలియదు కానీ..! కరెప్షన్‌కి పాల్పడుతున్నట్లు మాత్రం స్పష్టమవుతుంది..! మరోవైపు అక్రమ నిర్మాణాలపై చర్యల విషయంలో రెవెన్యూ అధికారులు పక్క పథకం ప్రకారమే అక్రమార్కులకు సహకరిస్తున్నారు.. అక్రమార్కుల ప్రలోభాలకు తలొగ్గి, ప్రభుత్వ భూమిలో నోటీసులు ఇచ్చిన అక్రమ షెడ్లకు సైతం, లక్షల్లో ముడుపులు పుచ్చుకుని, బరితెగించి పాక్షిక చర్యలతో సైలెంట్ అవుతున్నారు.. అందుకు దుండిగల్ మండలం బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డు నిర్మాణం..! గాగిల్లాపూర్ భూదాన్ భూమిలో అక్రమ షెడ్డు ప్రత్యేక నిదర్శనంగా చెప్పవచ్చు..
*కూల్చేసిన అక్రమ షెడ్డుకు.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్..*
మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం గాగిల్లాపూర్ గ్రామ శివారు, భూదాన్ భూమిలో రెవెన్యూ అధికారులు కూల్చేసిన,అదే అక్రమ షెడ్డుకు, దొమ్మర పోచంపల్లి విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. భూదాన్ భూమిలో భారీ షెడ్డును, రెవెన్యూ అధికారులు కూల్చేసినట్లు అక్రమ షెడ్డు, కళ్లెదుటే సాక్షాత్కరిస్తుంటే..! విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎలా ఇచ్చారని సంబంధిత ఏరియా, ఏఈతో (ఇంచార్జ్ ఏఈ) విషయాన్ని పెన్ పవర్ ప్రతినిధి ప్రస్తావించగా..! రెవెన్యూ అధికారులు, సంబంధిత షెడ్డును పూర్తిగా కూల్చేస్తే, తాము విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తొలగిస్తామని, ఇంచార్జ్ విద్యుత్ అధికారి(ఏఈ షాపూర్) సమాధానం పలు అనుమానాలకు తావిస్తోంది..
ఓవైపు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేస్తున్నా..! అధికారుల తీరు మారడం లేదు.. గాగిల్లాపూర్ భూదాన్ భూమిలో అక్రమ షెడ్డుని రెవెన్యూ అధికారులు కూల్చిన విషయం కళ్లెదుటె కనిపించినా..! గుడ్డిగా, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు..! ఫాక్స్‌సాగర్ నాలాపై, మార్వాడి అక్రమ నిర్మాణానికి సంబంధించిన తప్పుడు పర్మిషన్‌లను కూడా జీహెచ్ఎంసి రద్దుచేసింది.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు.. అయినప్పటికీ 10 మీటర్ల ఎత్తు నిబంధన ప్రక్రియతో 'ఓసీ' లేకపోయినా కుత్బుల్లాపూర్ విద్యుత్ అధికారులు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎలా సాధ్యం..? చారిత్రాత్మక ఫాక్స్‌సాగర్ నాలాపై మార్వాడి షాపింగ్ కాంప్లెక్స్‌కి, గాగిల్లాపూర్‌లో రెవెన్యూ కూల్చేసిన షెడ్డుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల మంజూరు అధికారుల ప్రతిపాదనలు లేకుండా సాధ్యమేనా..?
About The Author

మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.