భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన ఎంపీడీవో : పంచాయతీ కార్యదర్శులు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
👉🏻వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
👉🏻ఎంపీడీవో ఉమామహేశ్వరరావు
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఆగస్టు 18:బంగాళఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను జిల్లా కలెక్టర్,జెసి ఆదేశాల మేరకు గూడెం కొత్త వీధి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది పంచాయతీ కేంద్రాలలో ఉంటూ భారీ వర్షాల దృష్ట్యా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని తెలిపారు. గ్రామాలలో వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని అనగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడం, పొలాలు మునిగిపోవడం, గృహాలు కూలటం వంటి వాటిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేయాలని ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని ఎంపీడీవో ఆదేశించారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.