భారీ వర్షాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జీకే వీధి తహసిల్దార్ హెచ్ అనాజీరావు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,IMG-20250818-WA0712 ఆగస్టు18:అల్లూరి సీతారామరాజు జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జీకే వీధి మండల పరిధిలోని గ్రామాలలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని జీకే వీధి తహసిల్దార్ హెచ్ అన్నాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నేపథ్యంలో మండల తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు  ఒక ప్రకటనలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల కారణంగా గెడ్డలు, వాగులు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటేందుకు సాహసం చేయరాదని హెచ్చరించారు. గ్రామాలలో ఎక్కడైనా వర్షం కారణంగా చెట్లు రోడ్డుపై విరిగిపడటం, విద్యుత్ స్తంభాలపై చెట్లు పడటం, కొండచరియలు విరగడం వంటి ఘటనలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా తహసీల్దార్ కార్యాలయానికి తక్షణమే తెలియజేయాలని, గ్రామస్థాయి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, అవసరమైన సహాయాన్ని ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తహసీల్దార్ వెల్లడించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.