చింతపల్లి ఏరియా హాస్పిటల్ విద్యుత్ ఘాతకం ఘటనపై ఆరా తీసిన చింతపల్లి జడ్పిటిసి పోతురాజు బాలయ్య
చింతపల్లి,పెన్ పవర్, ఆగష్టు 27:సోమవారం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనపై మంగళవారం నాడు ఆసుపత్రిని సందర్శించి విద్యుత్ ఘాతంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతితో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిధంగా ఈమధ్యకాలంలో చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో వరసగా ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. షార్ట్ సర్క్యూట్ లో గాయపడిన విద్యుత్ సహాయకుడు లక్ష్మణ్ రావు కు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకోనేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రి పరిపాలన అధికారులు( సూపరింటెండెంట్ గా) సీనియర్ డాక్టర్లను నియమించాలన్నారు. సరియైన పరిపాలన, అవగాహన లేకనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొంటూన్నాయనీ, ఆసుపత్రి సూపర్డెంట్ గా అనుభవజ్ఞులను నియమించాలని అన్నారు. దీనీపై జిల్లా కలెక్టర్, అలాగే పిఓ దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. అదే క్రమంలో ఖాళీగా ఉన్న మత్తు డాక్టర్, గైనకాలజిస్ట్, సర్జరీ డాక్టర్లను వెంటనే నియమించాలనీ సంబంధించిన అధికారులను కోరారు. అన్నీ ఉన్నా యాక్సిడెంటు కేసులకు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్స్ చేయడానికి మత్తుమందు ఇచ్చే డాక్టర్ లేక జిల్లా ఆసుపత్రికి రిపర్ చేయాల్సివస్తుందని అన్నారు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా చింతపల్లి ఆసుపత్రి తీరుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. తరువాత వార్డులో ఉన్న పేషెంట్లకు ఆందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కంకిపాటి గిరిప్రసాదు, పార్టీ నాయకులు నరేష్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.
రిపోర్టర్ :రమేష్ చౌదరి (చింతపల్లి)
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.