రైతులు శిబిరాన్ని ఎత్తు వేయాలని అధికారులు ఒత్తిడి
పద్మనాభం. మండలంలోని కృష్ణాపురం గ్రామం లో నాలుగు రోజులుగా కృష్ణాపురం గ్రామ రైతులు 60 మంది తమ భూములకు నష్టపరి హారం ఇవ్వాలని కోరుతూ వారు భూములో టెంటు వేసి వంట ఓర్పు కార్యక్రమాన్ని భీమిలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ శిబిరాలను ఎత్తివేయాలని మండల రెవెన్యూ సిబ్బంది పద్మనాభం పోలీసులు రోజుకు రెండు మూడు సార్లు శిబిరము వద్దకు వచ్చి శిబిరాన్ని ఎత్తివేసి పద్మనాభం తాసిల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశిస్తున్నారు దీనికి రైతులు గ్రామంలోని తప్పనిసరిగా గ్రామ సభ పెట్టి రైతుల ఆమోదం గ్రామ పెద్దలు ఆమోదం తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు రైతులను 60 70 సంవత్సరాల నుండి మొక్కలు పెంచి ఫల సాయం వచ్చేసరికి భూసేకరణ పేరుతో మా భూములను అన్యాయంగా తీసుకోవడంపై రైతులు ఆందోళన చెందుతు న్నారు మా భూమి పై నష్టపరిహారాన్ని చెల్లించి మా జీవనోపాటికి సహకరించాలని కోరుచున్నారు.
About The Author

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.