రేపు “మీకోసం” రద్దు:ఘాట్ రోడ్ లో రేపు భారీ వాహనాలు నిషేధం:వాగులు దాటే ప్రయత్నాలు వద్దు:జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

IMG-20240717-WA0824 స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 29: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపధ్యంలో శుక్రవారం జరుగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు.అదేవిధంగా భారీ వర్షాల నేపధ్యంలో మూడు రోజుల పాటు ఘాట్ రోడ్లలో భారీ వాహనాలు రాకపోకలు నిషేదించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.భారీ వాహన దారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని లేదా రాకపోకలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులు వారి వారి ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని, ప్రత్యెక కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా ప్రజలేవ్వరూ ఎట్టి పరిస్థితులలోనూ వాగులు, ప్రవాహాలు దాటరాదని కలెక్టర్ సూచించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.