జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు:జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ దినేష్ కుమార్: 08935 299912,08935 293448

IMG-20240831-WA1222 స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు31 : రానున్న మూడు నాలుగు రోజులు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు.కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా 08935299912, 08935293448 నంబర్లతో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.అదేవిధంగా పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ కార్యాలయాలు,సబ్ కలెక్టర్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని తహశీల్దార్ & ఎంపీడీఓ కార్యాలయాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలుగా 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలనికలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, సన్నద్ధతలో భాగంగా తమ సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆయా కార్యాలయంలలో కంట్రోల్ రూమ్‌లను తెరిచి, నష్టపరిహారం గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని సూచించారు.జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, తుఫాను నష్టాల నివేదికను సమర్పించాలని ఆదేశించారు.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఉత్తర మరియు ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది రాబోయే 4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా & ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆగస్ట్ 29 నుండి అక్టోబర్ రెండు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.