మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం:అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం:అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు

స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి, పెన్ పవర్,అక్టోబర్ 23:రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు యత్నిస్తోందనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించి వినతిపత్రాలు అందజేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.పాడేరు క్యాంప్ కార్యాలయంలో ఈ ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను అల్లూరి జిల్లా అధ్యక్షులు, పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు శాసన సభ్యులు రేగం మత్యలింగం, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మరియు ఇతర నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ, “మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటిలో పాడేరులో 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన మెడికల్ కాలేజ్ అల్లూరి జిల్లా గిరిజన ప్రాంత ప్రజలకు ప్రాణాధారంగా మారింది. అలాంటి దేవాలయాల్లాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రయత్నం ప్రజలకు నష్టదాయకం. ఈ ప్రైవేటీకరణ యత్నాన్ని అడ్డుకునేందుకు పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తాం” అన్నారు. అలాగే ఆయన పార్టీ శ్రేణులందరినీ అక్టోబర్ 28న జరిగే ప్రజా ఉద్యమ ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కురూస పార్వతమ్మ, పాడేరు మండల అధ్యక్షులు సీధరి రాంబాబు, జీకే వీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం, అరకు జెడ్పీటీసీ చెట్టి అన్నా రోషిణి, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు పాంగి పరుశురాం, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి కూతంగి సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీధరి మంగ్లన్న దొరా, జిల్లా ప్రతినిధి కూడా సురేష్ కుమార్, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు రేగం చాణక్య, మాజీ ఎస్టీ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, సర్పంచులు వంతాల రాంబాబు, వనుగు బసవన్న దొరా, గొల్లోరి నీలకంఠం, ఎంపీటీసీ దూసురు సన్యాసి రావు, మండల యువజన అధ్యక్షుడు గల్లెలి లింగమూర్తి, మాజీ సర్పంచులు మినుముల కన్నపాత్రుడు, పాంగి నాగరాజు, సీనియర్ నాయకులు మోద బాబూరావు, ముదిలి సత్యనారాయణ, కూడ సుబ్రమణ్యం, డి.పి రాంబాబు, వంతాల నరేష్, కోడా సుశీల తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.