గూడెం కొత్తవీధి సీఐ వరప్రసాద్ బదిలీ
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వరప్రసాద్‌ను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. సుమారు ఏడాదిగా గూడెం కొత్తవీధి సీఐగా సేవలందించిన వరప్రసాద్‌ను విశాఖ సిటీకి బదిలీ చేసినట్లు తెలిసింది.వరప్రసాద్ స్థానంలో కొత్త సీఐని ఇంకా నియమించలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.బదిలీ ఆదేశాల అనంతరం స్టేషన్ సిబ్బంది వరప్రసాద్‌కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా జీకే వీధి మీడియా ప్రతినిధులు ఆయనను సన్మానించారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ హెచ్.అన్నాజీ రావు,ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.