మహిళా “ముఖ్యమంత్రి" పాలనలో మహిళ డాక్టర్ పై అత్యాచారం!

మహిళా “ముఖ్యమంత్రి

👉బెంగాల్ ప్రభుత్వం పై రాష్ట్రపతి చర్యలు చేపట్టాలి 

👉బెంగాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి 

👉నిరసన దీక్షలు చేస్తున్న డాక్టర్లకు జనసేన సంపూర్ణ మద్దతు 

👉జనసేన పార్టీ అరకు పార్లమెంట్ పాడేరు అసెంబ్లీ ఇంచార్జ్ వంపురి గంగులయ్య!

స్టాప్ రిపోర్టార్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగష్టు 17:వెస్ట్ బెంగాల్ లో గవర్నమెంట్ ఆస్పత్రిలో ఈ నెల 9 వ తేదిన ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ట్రైనీ డాక్టర్ అత్యాచార ఉదంతం యావత్ దేశానికే మరో నిర్భయ సంఘటన జ్ఞప్తికి తెచ్చింది అని జనసేన పార్టీ అరకు పాడేరు ఇంచార్జ్ వంపూరి గంగులయ్య అన్నారు.ఈ సంఘటన ప్రభుత్వ రక్షణ వ్యవస్థ లోపాలు,ఉదాసీనత జాతికి ఎత్తిచూపేల చేసిందని చెప్పవచ్చు అన్నారు.గతంలో నుంచి కూడా బెంగాల్ లో మహిళలపై అమానుష దాడులు అధికంగా జరుగుతూనే వుంది. విచిత్రమేమిటంటే ఆ రాష్ట్రంలో సాక్షాత్ ఒక మహిళ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ వుండటం ఆమెకు మహిళల భద్రత పై ఉన్న శిత్తశుద్ది ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.ఇది రాజకీయాలు చేసే అంశం కానేకాదు కానీ మా వంతుగా ప్రభుత్వ పేలవ పాలన తీరు ప్రజ పాలనవ్యవస్త ను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ అంశంలో గమనించానీ కోరుతున్నాం. డాక్టర్లు ఒక్క రోజు వారి విధులు బహిస్కరిస్తే ఇజ్రాయేల్, హమాస్ యుద్ధ క్షేత్రమైన గాజకి భారత్ కి తేడా ఏముంది? ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం మమత బెనర్జీ తీరు కచ్చితంగా ఆక్షేపనీయం? వాళ్ళకి ప్రతి అంశం రాజకీయ సంచలనమే కావాలి. ఈ సంఘటన దేశానికి మరో వారం రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం వుందంటే ముందు జరిగిన ఇటువంటి సమయంలో ఆ

IMG-20240817-WA0356
జనసేన నాయకులు డాక్టర్ వంపూరి గంగులయ్య

ఇంటలిజెన్స్ విభాగాలు ఏమి చేస్తున్నట్టు? దేశ విద్రోహ శక్తులు చర్యలపై ఆ రాష్ట్ర ,దేశ నిఘవ్యవస్త పని తీరు ఏమిటి? స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ దేశ మహిళలకు ఇచ్చే స్వేచ్ఛ భరోసా ఇదేనా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మెడికో లు విధులను బహిస్కరిఇస్తే దేశ పరిస్తితి ఏమిటి?మన లాంటి గిరిజన ప్రాంతాల పరిస్తితి ఏమిటి?అసలే వైద్యం అంతంత మాత్రంగా వుండే మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల పరిస్తితి ఏమిటి? యావత్ జాతి సిగ్గుతో తలదించుకునే అమానుష సంఘటన ఇంకా ఇంకా పునరావృతం కావడం దేశ చట్టాల పై సామాన్యులకు, విధుల్లో వుండే అధికారులకు, డాక్టర్లకు సైతం నమ్మకం పోతుందని చెప్పవచ్చు అన్నారు.ఇది రాజకీయాలకు అతీతంగా భారతీయ పౌరులుగా స్పందించాల్సిన అంశం ఇటువంటి సంఘటనలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే సరిపోదు దానిని అమలు పరిచే వ్యవస్థ పటిష్ఠం చెయ్యాలి.గిరిజన ప్రజలందరూ ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలి డాక్టర్లు లేని పాడేరు జనరల్ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి నీ ఊహించగలమా? ఈ రోజు కి ప్రసవించే గిరిజన మహిళల పరిస్తితి ఏమిటి? ఈ రోజు పాడేరు లో నిరసనకు దిగుతున్న వైద్యులకు మా వంతు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అలాగే రాష్ట్ర ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి సంఘటనల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్న మమత ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం అన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement