పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత:ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, అక్టోబర్ 25:పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గూడెం కొత్త వీధి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దామనపల్లి సర్పంచ్ కుందేరి రామకృష్ణ అన్నారు.శుక్రవారం దామనాపల్లి పంచాయతీ పరిధిలో దొడ్డి కొండ గ్రామంలో సచివాలయం సిబ్బంది గ్రామస్తులతో కలిసి ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దొడ్డికొండ గ్రామస్తులు గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది కూడ ఎంతో ఉత్సాహంగా పాల్గొని గ్రామస్తులతో పాటు కలిసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను చెత్తను తొలగించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గెమ్మెల చిలకమ్మా,వార్డు సభ్యులు గెమ్మెల మోహన్రావు, వైసిపి నాయకులు వంతల చంటిబాబు, డిజిటల్ అసిస్టెంట్ శేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ బాలయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ యుగంధర్,వెల్పర్ అసిస్టెంట్ పాత్రుడు,మహిళా పోలీసు భారతి,సర్వేయర్ బుజ్జిబాబు, వీఆర్పీ సత్తిబాబు, గ్రామస్తులు గోవింద, అజయ్, బలరాం, నరసింహారావు,చెదల చిట్టిబాబు,గ్రామ యువత,అంగన్వాడీ కార్యకర్తలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Related Posts

Advertisement

LatestNews