లాడ్జిలో నగదు పట్టివేత
By Admin
On
పామూరు
పట్టణంలోని నెల్లూరు రోడ్ నందు గల స్వాగత్ లాడ్జిలో శనివారం ఎన్నికల కోడ్ అమల్లో నేపథ్యంలో తనిఖీ నిర్వహించగా 1,35,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు . స్థానిక ఎస్సై సైదు బాబు కథనం మేరకు ఎన్నికల కోడ్ తనికి నేపథ్యంలో భాగంగా సిఐ రామ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వాగత్ లాడ్జి రూమ్ నెంబర్ 201లో తనిఖీ నిర్వహించినట్లు, తనిఖీలో 1,35,000 రూపాయలు లభించినట్టు తెలిపారు . నగలను సీజ్ చేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరైనా 25వేల రూపాయలను నుంచి నగదు కలిగి ఉండి, సదరు నగదుకు సరైన ఆధారాలు చూపలేని పక్షంలో నగదు స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రంలో క్రిమినెంట్ త్రీమెన్ కమిటీ అందజేస్తామని పోలీసులు ఈ అంశంపై త్రీ మెన్ కమిటీ విచారణ నిర్వహిస్తుందని పోలీసులు పేర్కొన్నారు . ఈ తనిఖీలు సిఐ రామ్ నాయక్ , ఎస్సై సైదు బాబు పాల్గొన్నారు
Tags: