అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ లో ఎమ్మెల్యే శిరీష దేవి
గంగవరం, పెన్ పవర్, జూలై 1:
రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి అన్నారు .గంగవరం మండలంలో మంగళవారం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఎండపల్లి, ఈ రామవరం గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేస్తూ లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారం వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎక్స్ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, గంగవరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పాము అర్జున్, ప్రధాన కార్యదర్శి భాను, రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, ఎంపీటీసీ పండా ఆదినారాయణ దొర, మాజీ ఎంపీటీసీ కోసు బుల్లియమ్మా , సారపు సత్య వేణి, ఎస్టీ సెల్ పామర్తి వీరబాబు, పల్లాల వెంకట్ రెడ్డి, పల్లాల వీరభద్రారెడ్డి, రేవుల అబ్బాయి రెడ్డి, దాని సీతమ్మ, కోటం బాపన్న దొర, నర్సి సూరమ్మ, ముర్రం చిన్న నరసన్న దొర, మడకం సత్తిబాబు, కనిగిరి సుబ్బు, పులిగే గోవిందరాజు, రాఘవ రెడ్డి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు, బీజేపీ నాయకులు కుంజం వెంకటేశ్వర్లు, గంగవరం మండల కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.