జీకే వీధి పంచాయితీలో జనసేన పార్టీ పంచాయతీ నూతన  కమిటీ ఏర్పాటు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్10:అరకులోని పార్లమెంటు మరియు పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్.వంపూరు గంగులయ్య యొక్క ఆదేశాల మేరకు, పాడేరు నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీరవెంకట్ మరియు మండల జనసేన అధ్యక్షులు కొయ్యం బాలరాజు ఆధ్వర్యంలో జీకే వీధి పంచాయితీకి నూతన కోర్ కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గడుతూరి పరమేశ్వరరావు అధ్యక్షుడిగా, గెమ్మెలి నర్సింగరావు ఉపాధ్యక్షుడిగా, కిల్లో సూరిబాబు ప్రధాన కార్యదర్శిగా,కిల్లో రాంబాబు, కార్యదర్శిగా,కొర్ర కృష్ణ కార్యదర్శిగా,సోషల్ మీడియా బాధ్యతలు సురకత్తి నాగేశ్వరరావు, మహిళా విభాగ బాధ్యతలు సలిమితి రేణుక చేపట్టారు.ఈ సందర్భంగా గొర్లె వీరవెంకట్ మాట్లాడుతూ, “గ్రామ పంచాయితీల స్థాయిలో కమిటీలు ఏర్పడటంతో పార్టీ బలోపేతం సాధ్యమవుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని అన్నారు. అలాగే, గ్రామాలలోని ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు మాట్లాడుతూ, “కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులు తమ తమ పంచాయితీలో పార్టీ ప్రాధాన్యతను పెంచేందుకు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలి” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెదవలస సర్పంచ్ పాంగి కృష్ణ వంశీ, సోషల్ మీడియా ఐటీ ఇంచార్జ్ కొయ్యం ఇమ్మానుయేల్ (సిద్దు), మొట్టడం వెంకటేష్, పాంగి చంటిబాబు, గెమ్మెలి వెంకటేష్, గెమ్మెలి ప్రసాద్, కొర్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,