90 శాతం సబ్సిడీపై రాజ్మా విత్తనాల పంపిణీ 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 27: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో ఎంపీపీ బోయిన కుమారి, ఎస్సై అప్పలసూరి ఎంపీటీసీలు సర్పంచులు ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో 90% సబ్సిడీపై పంపిణీ చేసే రాజ్మా విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90 శాతం సబ్సిడీతో పంపిణీ చేసే రాజ్మా విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. రాజ్మా విత్తనాలను దళారులకు విక్రయించకుండా రైతులు పంట వేసుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయాధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ రాజ్మా విత్తనాలను అన్ని పంచాయతీలలో రైతు సేవా కేంద్రాల వద్ద పంపిణీ చేయడం జరుగుతుందని రైతులు దీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లోత దేవుడు ఎంపీటీసీలు పసుపులేటి నాగమణి,రాజులమ్మ,రాజేశ్వరి, టిడిపి మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్, ఎన్డీఏ కూటమి నాయకులు బలరాం,మహేష్,జోగిరాజు పిఎసిఎస్ సీఈఓ వి. చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

 

 

 రిపోర్టర్ :

IMG-20240827-WA0534
90 శాతం సబ్సిడీపై రాజ్మా విత్తనాల పంపిణీ 

మాదిరి చంటిబాబు( పెన్ పవర్ స్టాప్ రిపోర్టర్)

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.