పట్టా భూమి పేరుతో..! ప్రభుత్వ భూమి కబ్జా..!!

గాజులరామారం సర్వే నెం.329లో రూ.14.5 కోట్లు విలువైన భూమి స్వాహా..!

పట్టా భూమి పేరుతో..! ప్రభుత్వ భూమి కబ్జా..!!

గాజులరామారం సర్వే నెం.333,334 వక్ఫ్‌బోర్డు స్థలంలో 2018 నవంబర్‌లో వెంచర్ పనులు అడ్డుకున్న రెవెన్యూ అధికారులు,మళ్ళీ‌ కబ్జాచేస్తున్నా పట్టించుకోవడం లేదు..! డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పక్కన 329 ప్రభుత్వ భూమిలో 20 గుం. ఆక్రమించి అక్రమంగా రూము నిర్మాణం చేపట్టగా, 2023 నవంబర్ 25న రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.. అదే చోట అక్రమార్కులు మళ్ళీ ఒక కంటైనర్ ఏర్పాటు చేశారు.. అయినప్పటికీ 6 నెలలుగా రెవెన్యూ చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. కొద్ది కొద్దిగా కబ్జా చేసేందుకు తాజాగా నర్సరీని పెట్టి కబ్జాలో ఉన్నారు.. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతున్న వ్యవహారం అయినప్పటికీ చర్యలు శూన్యం..

ZomboDroid_18062024082519

గాజులరామారం సర్వే నెం.329 ప్రభుత్వ బోర్డును తొలగించి కబ్జా..

ZomboDroid_18062024083145

328 పట్టాభూమి పేరుతో..! ప్రభుత్వ భూమిలో పాగా..!!

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూన్ 18:

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల కార్యాలయంలో, గత ఏడాదిన్నర క్రితం..! కబ్జాలపై చర్యలు తీసుకోకుండా సహకారించారని..! ఒక్క తహశీల్దార్ కార్యాలయంలోనే ఒక ఆర్ఐ సహా, ముగ్గురు విఆర్ఏలను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విదితమే..! అయినప్పటికీ రెవెన్యూ అధికారుల్లో మార్పు రావడంలేదు..! కుక్క తోకకు గుండ్రాయి కట్టినా వంకర వంకరే అన్న చందంగా తయారైంది.. కబ్జాలను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు.. అక్రమార్కులకు ఆక్రమించు కోవడానికి ఓ ప్రభుత్వ భూమి కావాలి..! అధికారులు జేబులు నింపుకోవడానికి ఓ అవకాశం కావాలి..! అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. మేడ్చల్ జిల్లాలోనే కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా తయారైన గాజులరామారం ప్రభుత్వ భూములపై..! అధికారుల్లో ఇప్పటికీ అలసత్వం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల విధులతో కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు..!వెంటనే సుమారు 10-15 రోజులు తహశీల్దార్, ఆర్ఐ, లీవ్ పెట్టి వెళ్ళడంతో..! తహశీల్దార్ కనిపించటం లేదని, స్థానికులు‌ మిస్సింగ్‌ కేసుతో నిరసన తెలియజేశారు.. దీంతో కబ్జాదారులకు కూడా హద్దు లేకుండా పోతోంది..

ZomboDroid_18062024084457

గతంలో కూల్చివేసిన చోటనే.. మళ్ళీ కంటైనర్ ఏర్పాటు..

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం దేవేందర్ నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఆనుకుని 329 ప్రభుత్వ భూమి ఉంది.. సర్వే నెంబర్ 328 పట్టాభూమి పత్రాలతో..! 329 ప్రభుత్వ భూమిలో పాగా వేస్తున్నారు.. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు బహిరంగంగానే సహకరిస్తున్నట్లు స్పష్టమవుతుంది.. దేవేందర్ నగర్‌లోని 329 ప్రభుత్వ స్థలంలో 328 పేరుతో కబ్జాలకు పాల్పడుతుండగా..! 2018లోనే ప్రస్తుత ఆర్ఐ, అప్పట్లో విఆర్వోగా ఉన్న రజనీకాంత్ కూల్చివేశారు.. ఆ ఫోటోలు నేటి పెన్ పవర్ దినపత్రికలో చూడవచ్చు.. 2023 నవంబర్ 25న కూడా ఆర్ఐ రజనీకాంత్ కూల్చివేతలు జరిపారు.. ఆతర్వాత ఏమైందో..? ఏ ఒప్పందం కుదుర్చుకున్నారో కానీ..! అదే కబ్జాదారులు మళ్ళీ కంటైనర్‌తో పాటు నర్సరీతో ఆక్రమించారు.. ఆరు నెలలు గడిచినా అధికారుల చర్యల్లేవు..! ముడుపులు ముట్టినందుకే చర్యల్లేవని, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

IMG-20240618-WA0010

IMG-20240618-WA0011

328 పట్టా భూమి ఉన్నది ఎక్కడ..? కబ్జాచేసింది ఎక్కడ.. ? అధికారులకు అవగాహన లేదా..?

"చెలిమ"లో నీటిలా..!"ఊరుతున్న" పట్టా భూమి..!!

కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నెంబర్ 329 ప్రభుత్వ భూమి అధికారుల నిర్లక్ష్యంతోనే కబ్జాకు గురవుతుంది.. ఉన్నదంతా అమ్మేసిన, 328 పట్టాభూమి "చెలిమలో నీటిలా..! ఊరుతుందా అంటూ ఎద్దేవా చేసేవారు లేకపోలేదు..!
 కోట్లు విలువచేసే సర్కారు భూములు కళ్ళ ముందే హారతి కర్పూరంలా కరిగిపోతుంది.. మరోవైపు తహశీల్దార్ అబ్దుల్ రెహమాన్, ఆర్ఐ రజనీకాంత్ గతంలో..! ఒకరు ఆర్ఐగా, మరొకరు విఆర్‌వోగా కుత్బుల్లాపూర్‌లో విధులు నిర్వర్తించి వారే..‌! గాజులరామారం ప్రభుత్వ భూముల పట్ల అవగాహన ఉన్న అధికారులే..! చర్యలు తీసుకున్న నాటి ఫోటోల ఆధారాలు కూడా ఉన్నాయి.. అయినప్పటికీ ఏమి తెలియనట్టు వ్యవహరించడం కొసమెరుపు.. సర్వే నెం. 329 ప్రభుత్వ భూమి సుమారు 250 ఎకరాలు మహాసముద్రంలా ఉంటుంది..! అందులో 328 పట్టాభూమి ఎ.10.39 గుం. (వడాఫా) చిన్న ద్వీపంలా ఉంటుంది.. దేవేందర్ నగర్‌లోని 328 పట్టాభూమిని "వీనస్ రాక్ హైట్స్" వెంచర్ నిర్వాహకులకు, 10.39 గుంటలు భూ యజమాని విక్రయించాడు.. కానీ సదరు పట్టాభూమి చుట్టూ సర్వే నెం. 329 ప్రభుత్వ భూమి ఉంది.. దీంతో అక్రమార్కులు దొరికిన కాడికి సర్వే నెం.328 పట్టాభూమి  పేరుతో..! 329 ప్రభుత్వ స్థలంలో కబ్జాలకు పాల్పడుతున్నారు.. ఒక్క వీనస్ రాక్ హైట్స్‌ వెంచర్‌లోనే  329 సుమారు మూడెకరాలకు పై చిలుకు అదనంగా ఆక్రమించుకున్నట్లు రిజిస్ట్రేషన్‌లు చెబుతున్నాయి..

ప్రభుత్వ బోర్డును తొలగించి మరీ కబ్జా..!

సర్వే నెం. 329 ప్రభుత్వ భూమిలో కొంత డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు.. పక్కనే 329 ఖాళీ స్థలం ఇప్పటికీ ఖాళీగానే ఉంది.. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా పెట్టారు.. అయితే గత ఏడాది ప్రభుత్వ బోర్డును తొలగించి ఓ వ్యక్తి భారీ షెడ్డును, అక్రమంగా నిర్మించాడు.. పెన్ పవర్ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలకు అప్పటి తహశీల్దార్ సంజీవరావు ఆదేశాలతో, రెవెన్యూ, జీహెచ్ఎంసి ఉమ్మడి చర్యల్లో భాగంగా కూల్చివేశారు.. ఆతర్వాత మరో వ్యక్తి..! తనకు 328 పట్టా భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయంటూ..! సర్వే నెంబర్ 329 ప్రభుత్వ భూమిలో ఓ పేరు మోసిన బిల్డర్‌ సహకారంతో రంగంలోకి దిగాడు.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఆనుకొని ఒక అక్రమ నిర్మాణం చేపట్టడంతో 2023 నవంబర్ 25న రెవెన్యూ అధికారులు‌ కూల్చివేశారు..

పట్టాభూమి పత్రాలు ఉంటే..! ప్రభుత్వ భూమి కట్ట బెడతారా..?

కోట్లు విలువచేసే ప్రభుత్వ భూముల పట్ల..! రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమో..! లేక సహకారమో..! తెలియదు కానీ..! రెవెన్యూ అధికారులకు తెలిసే కబ్జా జరుగుతుందని తెలుస్తోంది.. పట్టాభూమిని మొత్తం విక్రయించి వెంచర్ కూడా పూర్తిచేసిన తర్వాత..!329 ప్రభుత్వ ఖాళీ స్థలంలో..! 328 పట్టాభూమి తమదే అంటూ అక్రమార్కులు కబ్జా చేయడం.. అధికారులు‌ వత్తాసు పలకడం వెనుక, భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్నాయి.. ప్రభుత్వ భూమిని పలుకుబడితో కాజేసేందుకు..! పట్టాభూమికి పత్రాలు సృష్టించి , రెవెన్యూ అధికారులు రూమును కూల్చివేసిన...! అదే చోట మళ్ళీ సవాల్ విసురుతూ కంటైనర్ ఏర్పాటు చేయడం..! ఆరు నెలలుగా ఆక్రమణలో ఉండటం అంతా తహశీల్దార్, ఆర్ఐల ఆశీర్వాదమేనని ఆరోపిస్తున్నారు..

IMG-20240614-WA0005ప్రస్తుత ఆర్ఐ రజనీకాంత్ 2018లో (VRO) కూల్చివేసిన నాటి..ఫైల్ ఫోటో..

IMG-20240618-WA0007

ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి మరీ కబ్జా.. కార్యాలయం కట్టించిన రుణదాత కదా..!

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts