సంక్షేమ పథకాలకు మారుపేరు జగన్.. మిథున్ రెడ్డి

సంక్షేమ పథకాలకు మారుపేరు జగన్.. మిథున్ రెడ్డి

రావులపాలెం

18 న రావులపాలెం లో జగన్ సభ

 రావులపాలెం లో శుక్రవారం సి ఆర్ సి కళ వేదిక లో కొత్తపేట వైసిపి అభ్యర్ధి చిర్ల జగ్గిరెడ్డీ అధ్యక్షతన ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ ఈ నెల 18 న జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేము అంతా సిద్ధం అంటూ బస్ యాత్ర జరగనున్నట్లు పత్రిక ముఖంగా అన్నారు.సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రజలందరికీ తెలిసినా ప్రతిపక్ష నాయకులు కూటముల పేరుతో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలి రానున్న ఎన్నికల లో తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని అన్నారు.ఈ బస్ యాత్రలో ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్,చిర్ల జగ్గిరెడ్డీ,పైనిపే విశ్వరూప్,పొన్నాడ సతీష్,రాపాక వరప్రసాద్ ముఖ్య నాయకులు కుడుపూడి సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts