రోజుకో ఏడుగురు ఎమ్మెల్యేలతో భేటీ

Meeting with seven MLAs per day

రోజుకో ఏడుగురు ఎమ్మెల్యేలతో భేటీ

పార్టీ బలోపేతంపై సీఎం ఫోకస్ – డిన్నర్ డిప్లమసీతో లోకేశ్ బాండింగ్
 
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తవుతున్న వేళ, ప్రభుత్వం ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి సారించింది. అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

 
స్టేట్ పొలిటికల్ బ్యూరో – పెన్ పవర్ విజయవాడ, ఫిబ్రవరి 17:


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తవుతున్న వేళ, ప్రభుత్వం ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి సారించింది. అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

4


నియోజకవర్గాల వారీగా సమీక్షలు :  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుసగా ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలయ్యాయా? ప్రభుత్వంపై ప్రజల స్పందన ఏంటి? పార్టీ పరంగా చేయాల్సిన పనులు ఏమిటి? వంటి అంశాలపై ఆయన నేరుగా చర్చిస్తున్నట్లు సమాచారం. సమస్యలు చెప్పుకునే వేదిక లేకపోయిందనే విమర్శలు రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా విజయవాడలోనే ఉండటంతో, ఇదే సమయాన్ని వినియోగించుకుంటూ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భేటీలు కొనసాగుతున్నాయి.


‘డిన్నర్ విత్ లోకేశ్’ – కొత్త ప్రయోగం : అటు మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబసభ్యులతో డిన్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు ఈ భేటీలు కొనసాగనున్నాయి. ఈ విందు సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలపై చర్చించడంతో పాటు, ప్రజాప్రతినిధులతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా బాండింగ్ పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత అనుభవాల పాఠాలు : గత ప్రభుత్వ హయాంలో సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదన్న అసంతృప్తి అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచే వినిపించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో సమయానుకూలంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా అసంతృప్తులకు తావు లేకుండా చూసుకోవాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియా ఫాలోఅప్ నుంచి నేరుగా సంభాషణ వరకు : మంత్రి లోకేశ్ సోషల్ మీడియా వేదిక “ఎక్స్” ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తూ, వాటిని కార్యాలయ బృందానికి అప్పగించి ఫాలోఅప్ చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు డిన్నర్ సమావేశాల ద్వారా నేరుగా ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలతో చర్చలు జరిపి, స్థానిక సమస్యలపై లోతుగా అవగాహన పొందే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
ఫ్యూచర్ పాలిటిక్స్‌కు వ్యూహాత్మక అడుగులు : స్థానిక ఎన్నికల ముందు పార్టీ బలోపేతం, గ్రూపు రాజకీయాలకు చెక్, కమ్యూనికేషన్ లోపాలకు ముగింపు అనే మూడు లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూ ఉండగా, లోకేశ్ అనుబంధాన్ని బలోపేతం చేసే బాధ్యతను తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఈ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యేలోపు ‘డిన్నర్ విత్ లోకేశ్’ కార్యక్రమం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 

About The Author

Related Posts