శివనామస్మరణతో పులకించిన బలిఘట్టం

మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు

శివనామస్మరణతో పులకించిన బలిఘట్టం

IMG-20260215-WA0379

నర్సీపట్నం, పెన్ పవర్ :

మహాశివరాత్రి సందర్భంగా నర్సీపట్నం పరిసర ప్రాంత శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నర్సీపట్నం మున్సిపాలిటీ శివారు బలిఘట్టంలో సాక్షాత్తు బ్రహ్మచే ప్రతిష్టించబడిన శైవ క్షేత్రం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరీ సమేత బ్రహ్మ లింగేశ్వర స్వామి వారి దర్శనానికి వేకువజామునుండే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దక్షిణకాశీగా పేరుగాంచిన ఉత్తరవాహిని నదిలో స్నానమాచరించిన అనంతరం బ్రహ్మ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దీంతో పుణ్యా స్నానాలకు తరలివచ్చే భక్తుల కోసం ఉత్తర వాహని నదీతీరంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని ఒక క్రమ పద్ధతిలో భక్తులు స్వామి వారి దర్శనం పూర్తిచేసుకుని,  బయటకు వచ్చేలా ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ చూపించింది.

IMG-20260215-WA0381

పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, కుల సంఘాలు భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ పర్యవేక్షణలో విఐపి భక్తుల కంటే సామాన్యుల దర్శనానికి పెద్ద పేట వేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం మరియు అంబులెన్స్ ను అందుబాటులో ఉంచారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా సమన్వయంతో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags:

About The Author

Related Posts