లింగవరం– లంక వీధి మధ్య తారు రోడ్డు కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది 

అడవి తల్లి బాటతో దామనాపల్లి పంచాయతీకి తారు రోడ్డు- ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపిన కూటమి నేతలు

IMG_20260215_205246    గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఫిబ్రవరి 15:గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీకి చెందిన కూటమి నాయకులు పేర్కొన్నారు. దామనాపల్లి పంచాయతీలోని లింగవరం నుండి లంక వీధి గ్రామాల వరకు ప్రభుత్వం చేపట్టిన “అడవి తల్లి బాట” కార్యక్రమం ద్వారా తారు రోడ్డు నిర్మాణం చేపట్టడం హర్షణీయమని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.కూటమి నాయకుడు వంతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈ రోడ్డుకు అనేక మార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినప్పటికీ నిర్మాణం జరగలేదన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే పనులు ప్రారంభమై రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామస్థుల ఇబ్బందులు తొలగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూటమి ప్రభుత్వం మంజూరు చేసినవేనని అన్నారు.అభివృద్ధి పనులకు అధికారంలో ఉన్న వైసీపీ సర్పంచ్లు,ఎంపీటీసీలు కూటమి నాయకులను ఆహ్వానించడంలేదని,కొంతమంది అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.దామనపల్లి పంచాయతీలో చేపడుతున్న పనులకు కూటమి నాయకులకు కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వెంకటేశ్వర్లు,నాగరాజు,రమణమూర్తి,మత్స్యరాజు,గంగరాజు చిన్నయపడాల్, కేశవ,సతీష్ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.