జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మల్ రెడ్డి రాంరెడ్డి జన్మదిన వేడుకలు

జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మల్ రెడ్డి రాంరెడ్డి జన్మదిన వేడుకలు

జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మల్ రెడ్డి రాంరెడ్డి జన్మదిన వేడుకలు

ఎల్బీనగర్ పెన్ పవర్ ఫిబ్రవరి 10 :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చారిత్రాత్మక కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం మన్సూరాబాద్ లోని స్పందన పాలది పాపయ్య వృద్ధాశ్రమంలో వృద్దుల సమక్షంలో కేకును కట్ చేయించి వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్ రెడ్డి రాంరెడ్డి ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్దులు పాల్గొన్నారు.

IMG-20260210-WA0029

Tags:

About The Author

Related Posts