కొరడా ఝలిపించిన ఈసీ

A whip-lashed EC

కొరడా ఝలిపించిన ఈసీ

106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌..ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై..! కొరడా ఝలిపించిన ఈసీ..  మెదక్ బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి రిటైర్డ్ కలెక్టర్ వెంకటరామిరెడ్డిపై కేసునమోదు.. మాజీ కలెక్టర్‌మీద అభిమానంతో బీఆర్ఎస్ సభకు వెళ్ళి సస్పెండ్ అయిన 106 మంది అధికారులు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొన కూడదనే నియమావళి ఉల్లంఘన..సీసీ టివి పుటేజీ పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి 106 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ..

స్టేట్ బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 09:

మాజీ కలెక్టర్ మీద ఉన్న అభిమానంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా విధించిన..! ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొన్న కూడదని కనీస నిబంధనలు విస్మరించారు.. కేంద్ర ఎన్నికల కమిషన్‌‌కు అందిన సమాచారం మేరకు,వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.. సమావేశం నిర్వహించిన ఫంక్షన్ హాల్‌లో సీసీ కెమెరాల పుటేజిని ఎన్నికల అధికారులు పరిశీలించారు..

OFFICERS

సమావేశం ముగిసిన తరువాత కూడ రాత్రి 10-15 మంది అధికారులు సభా వేదిక వద్ద ఉన్నట్లు గుర్తించారు.. మొత్తం పాల్గొన్న వారి వివరాలను సేకరించిన ఎన్నికల అధికారులు నివేదిక సిద్దం చేసి చర్యలు చేపట్టారు.. ఈ నేపథ్యంలో సిద్దిపేట త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు మేరకు సమావేశంలో పాల్గొన్న 106 మంది ఉద్యోగులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ మను చౌదరి సస్పెండ్‌ చేశారు..ఇప్పటికే మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు సమాచారం.. సస్పెండ్‌ అయిన వారిలో సెర్ప్‌ ఉద్యోగులు 38 మంది, ఏపీఎంలు-14, సీసీలు-18, వివోఏలు-4, సిఓ-1, సిబి ఆడిటర్స్‌-1, అలాగే 68 మంది ఈజీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు.. వారిలో ఏపీవోలు-4, ఈసీలు -7, టిఏలు-38, సిఓలు-18, ఎఫ్‌ఎ-1లు ఉన్నారు.

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల