79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం:జనసేన నేత గొర్లె వీర వెంకట్ పిలుపు

IMG-20250814-WA0966  గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 14:ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం అని అరకు పార్లమెంట్ జనసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఔన్నత్యాన్ని గౌరవించుకోవడమే ప్రతి భారతీయుని బాధ్యతగా ఆయన పిలుపునిచ్చారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా వర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పత్రికాముఖంగా విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ,"ప్రతి ఒక్కరూ తమ హక్కులను పరిరక్షించుకుంటూ,సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.మన దేశం పట్ల గౌరవాన్ని చాటేలా, అభివృద్ధికి తోడ్పడేలా కృషి చేయాలి" అని సూచించారు.దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్పూర్తిని నేటి తరాలు తెలుసుకోవాలని, వారి ఆశయాలను నెరవేర్చే విధంగా మనం ముందుకు సాగాలని పేర్కొన్నారు. "స్వాతంత్ర దినోత్సవం ఒక్క పండుగ కాదని, ఇది ఒక బాధ్యతను గుర్తుచేసే రోజు" అని వివరించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.