సంక్షేమ సారధి,అభివృద్ధి ప్రదాత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి

సంక్షేమ సారధి,అభివృద్ధి ప్రదాత దివంగత నేత  వైయస్ రాజశేఖర్ రెడ్డి

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,జి.మాడుగుల.పెన్ పవర్,జూలై 8: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు వైయస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులకు, బ్రెడ్డు పాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ,108, రైతులకు పోడు భూమి పట్టాల పంపిణీ, సున్నా వడ్డీ, అభయ హస్తం ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ పేదవానికి ఇల్లు, అలాగే వైద్యం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైయస్సార్ కు చెందుతుంది అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నూర్మని మత్యకొండం నాయుడు, వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, జి మాడుగుల ఎంపిటిసి మత్య రాస విజయ కుమారి,సింగర్భ సూపర్ ఎంపీటీసీ పాంగి చిట్టిబాబు, కే కొడపల్లి సీనియర్ నాయకుడు మాతే వెంకట రమణ,గెమ్మెలి సర్పంచ్ శీదరి కొండబాబు, బాలయ్య పడాల్, బంగారు రాజు,రమణ, మన్మధరావు,నీలమ్మ,వరలక్ష్మి, సాయి,మత్యరాజు, వెంకట్, వేణుబాబు, పండు దొర, మర్రి బాలరాజు చిన్నారావు, లక్ష్మణ్, దేములు నాయుడు, సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.IMG-20240708-WA0841

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల