బెంగుళూరు బెంగ..! మనకూ తప్పదా..?

బెంగుళూరు బెంగ..! మనకూ తప్పదా..?

నీరు లేకపోతే..! మిగిలేది కన్నీరే..

చర్యలకు వెనకడుగు వేస్తే..! నీటి సంక్షోభం తప్పదు..!!

 

IMG-20240411-WA0074

 

IMG-20240411-WA0075

ఓవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి త్రాగునీటి సరఫరాపై వీడియో సమీక్షలు..! మరోవైపు జిల్లా కలెక్టర్‌లు నీటి ఎద్దడి ఏర్పడితే త్రాగునీటి వనరులకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని నిత్యం సమీక్షలు, సమావేశాలతోనే సరి పెడుతున్నారు కానీ.. చెరువులు, కట్టుకాలువలు కబ్జాకు గురవుతున్నాయని పత్రికల్లో వార్తలు వచ్చినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు..! ఒక్క మాటలో చెప్పాలంటే అధికార యంత్రాంగం విధులు అక్రమార్కుల కబ్జాలను సక్రమం చేసేందుకేనని స్పష్టమవుతుంది..

జీహెచ్ఎంసి పరిధిలోని చెరువులకు, గొలుసుకట్టు కాలువలకు భద్రతే లేదంటే అతిశయోక్తి కాదు..  పదేళ్ళ క్రితమే ఏఈగా రిటైర్డ్ అయిన రామారావు ఒక్కడినే..! గత పదేళ్ళుగా నార్త్ ట్యాంక్ డివిజన్‌లో ఒకే వ్యక్తి రామారావు ఔట్ సోర్సింగ్ ఏఈగా విధుల్లో కొనసాగటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది..

ఈ పదేళ్ళలో  చెరువులు, కట్టుకాలువలు, కబ్జాచేసి నిర్మించిన నిర్మాణాలు పాతవి కూడా అయ్యాయి.. ఏఈ రామారావు రిటైర్డ్ కాకముందు..! అయిన తర్వాత అన్న చందంగా చెరువుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.. అంతకు ముందు ఎలా ఏడ్చిందో కానీ..! ఈ పదేళ్ళలో వేలకోట్లు విలువైన చెరువు ఎఫ్‌టిఎల్‌, బఫర్, కట్టుకాలువలు కబ్జాకు గురయ్యాయి..

మాధవ్ పత్తి..మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్

 

 

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల