కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా బబ్బూరు పృథ్వీ గౌడ్
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా : బబ్బూరు పృథ్వీ గౌడ్
కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా బబ్బూరు పృథ్వీ గౌడ్
రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా : బబ్బూరు పృథ్వీ గౌడ్
ఎల్బీనగర్ పెన్ పవర్ ఫిబ్రవరి 18:
కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా బబ్బూరు పృథ్వీ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం.రాజీవ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా నియమితులైన బబ్బూరు పృథ్వీ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తానని హామీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వైద్యులకు తెలియజేసి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. తనను డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ కు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం.రాజీవ్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

