కార్యకర్తలారా.. మీరే అభ్యర్థులుగా ప్రచారం నిర్వహించండి

కార్యకర్తలారా.. మీరే అభ్యర్థులుగా ప్రచారం నిర్వహించండి

అనపర్తి

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి..

కూటమి పెద్దల ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు తొస్సిపూడి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం పునఃప్రారంభించడం జరిగిందని కార్యకర్తలందరూ తామే అభ్యర్థులుగా భావించి ఇంటింటా ప్రచారాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే దేశం పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో మాట్లాడుతూ
ఎమ్మెల్యే ఓటు సైకిల్ పై ఎంపీ ఓటు కమలం గుర్తుపై వేసి రెండు స్ధానాలను గెలిపించమని కోరడం జరిగిందన్నారు. రేపటి నుండి మా కుటుంబం అందరూ మూడు వైపుల నుండి ప్రచారం మొదలు పెడతామన్నారు.
ప్రతీ ఓటరుని కలసి కూటమి ప్రకటించిన పధకాలను వివరించి ఓటు అడగాలన్నారు. ఎమ్మెల్యే గా నన్ను గెలిపించుకోవడంతో బాటు ఎంపీ గా బిజెపి అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించడానికి శక్తివంచన లేకుండా అందరూ కృషి చేయాలన్నారు. అసెంబ్లీ సీటుపై నెలకొన్న పరిస్థితులలో అండగా నిలిచి నన్ను నడిపించిన ప్రతీ నాయకుడికీ, కార్యకర్తకి రుణపడి ఉంటానన్నారు. రాబోయే 29 రోజులు గ్రౌండ్ లెవెల్ లో శక్తివంచన లేకుండా అందరం కృషి చేస్తే విజయం దానంతట అదే వరిస్తుందని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.

Tags:

About The Author

Related Posts