ఇప్పుడు పాటలు, మాటలు అన్ని ఈ స్మార్ట్ హెల్మెట్తో

 ఇప్పుడు పాటలు, మాటలు అన్ని ఈ స్మార్ట్ హెల్మెట్తో

 ఏథర్ ఎనర్జీ రిజ్టా(Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్  చేసింది. దీనితో పాటు హాలో స్మార్ట్ అనే హెల్మెట్ కూడా ప్రవేశపెట్టింది. దింతో భారతదేశపు మొట్టమొదటి లేటెస్ట్  టెక్నాలజీ, హై సెక్యూరిటీ స్మార్ట్ హెల్మెట్‌ను తీసుకొచ్చిన  ఘనత ఏథర్‌కు దక్కింది. ఏథర్ హాలో స్మార్ట్ హెల్మెట్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. 

హై-క్వాలిటీ ఆడియోతో రైడ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి హర్మాన్ కార్డాన్‌తో ఈథర్ పార్ట్నర్ షిప్ కుదుర్చుకుంది. మ్యూజిక్  కాకూండా  రైడర్ ముఖ్యమైన సౌండ్స్  వినగలిగేలా  హెల్మెట్ ని ఈథర్ రూపొందించింది. 

 హాలో వేర్ డిటెక్ట్ టెక్నాలజీ హెల్మెట్ ధరించినప్పుడు హెల్మెట్, ఫోన్ ఇంకా బైక్  3-వే పేరింగ్  ఉంటుంది. ఇవన్నీ హాలోతో ఆకర్షణీయమైన, ఆనందించే ఇంకా  సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని  ఏథర్ నమ్మకంగా ఉంది. 

 ఏథర్ హాలో బిట్ అనే మోడల్‌ను ఈథర్ హాఫ్ ఫేస్ హెల్మెట్‌తో తీసుకొచ్చింది. ఏథర్ ISI ఇంకా DOT సర్టిఫైడ్ హాఫ్-ఫేస్ హెల్మెట్‌ను అభివృద్ధి చేసింది, ఈ హెల్మెట్   త్వరలో ప్రజలకి  అందుబాటులోకి వస్తుంది ఇంకా Halobitకి అనుకూలంగా ఉంటుంది. హాలో హెల్మెట్ ప్రారంభ ధర రూ.12,999, హలోబిట్ ధర రూ. 4,999 ఉంది.

maxresdefault

About The Author

Related Posts