#
#vijayadurga-two-wheelers-association-who-has-provided-financial-support-to  #narsipatnamnews      #anakapallinews
                             <% catList.forEach(function(cat){ %>                                 <%= cat.label %>                              <% }); %>                                                         
                                                 <%- node_title %>
Published On 
                             By <%= createdBy.user_fullname %>
                         <%- node_title %>
Published On 
                                                         By <%= createdBy.user_fullname %>
                         <% if(node_description!==false) { %>                                                                                  <%= node_description %>                         
                         <% } %>                                                  <% catList.forEach(function(cat){ %>                             <%= cat.label %>                          <% }); %>                         
                                                 Read More...                                             అనారోగ్యం పాలైన తోటి మెకానిక్ కు ఆర్ధికసాయం అందజేసిన విజయదుర్గా టూ వీలర్స్ అసోసియేషన్
Published On 
                         By SIVAKUMAR.L
                     
                         నర్సీపట్నం, పెన్ పవర్ : తమ తోటి మెకానిక్ అనారోగ్యం పాలవడంతో విజయదుర్గా టూవీలర్స్ అసోసియేషన్ తరుపున తోటి మెకానిక్ లు ఆదుకునే ప్రయత్నం చేశారు.  నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డుకు చెందిన రెల్లి బాబ్జి అనే మెకానిక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మతిస్థిమితం కోల్పోయాడు.  మెకానిక్ గా జీవితం కొనసాగిస్తున్న బాబ్జికి, తనకు వచ్చిన జబ్బుకు వైద్యం తలకు మించిన భారం అయింది. తన కష్టాన్ని తెలుసుకున్న తోటి మెకానిక్ లు విజయ్ దుర్గా టూ వీలర్స్ అసోసియేషన్ తరపున 70 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సొమ్మును ఆదివారం ఉదయం యూనియన్ అధ్యక్షుడు మాకిరెడ్డి అప్పారావు మిగతా సభ్యులు కలిసి బాబ్జి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి బాబ్జి ఎంతగానో కృషి చేశాడని, ఇప్పుడు అతనికి కష్టం వచ్చిన సందర్భంలో మేమంతా అండగా నిలబడడం మా బాధ్యతగా భావించామని అన్నారు. ప్రస్తుతం మందులకు, హాస్పిటల్కు అయ్యే ఖర్చుల నిమిత్తం 70 వేల రూపాయలు ఇస్తున్నామని, మరింత  మెరుగైన వైద్యం కోసం,  మరింత సాయం చేయడానికి యూనియన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఒక కుటుంబంగా కలిసి జీవనం సాగిస్తున్న  యూనియన్ లో ఎవరికి కష్టం వచ్చినా స్పందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేపాడ చిరంజీవి, బొందాడ లోవ, ఎం.సత్తిబాబు, మార్గాన రవి,  బండారు చిరంజీవి, మందపల్లి చిట్టిబాబు, కైసర్ల మూర్తి తదితరులు పాల్గొన్నారు.                    