నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు

నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు

తారు రోడ్డుపై మొలచిన పచ్చ  గడ్డి

 తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో నిర్మాణం పూర్తికాకుండానే రోడ్డుపై పచ్చగడ్డి మొలుస్తున్న సంఘటన పలువురిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.
 
వివరాల్లోకి వెళితే చవిటి దిబ్బల నుండి బండి గడ్డ రోడ్డు వరకు సుమారు 7:30 కిలోమీటర్ల మేర 3.40 కోట్ల రూపాయలు వ్యయంతో తారు, సీసీ  రోడ్ నిర్మాణం ప్రారంభించారని స్థానికులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఉద్దేశంతో ఆదరా బాదరాగా రహదారి నిర్మాణం పనులు చేపట్టారని తెలిపారు. ఈ రహదారి నిర్మాణపు పనులు ప్రారంభించి సుమారు ఆరు నెలలు అవుతుందని, ఇందులో అర కిలోమీటరు వరకు సిసి రోడ్డు నిర్మించవలసి ఉందని ఆయా గ్రామస్తులు తెలిపారు. కాంట్రాక్టర్ తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డులో గడ్డి మొలిచిందని అంటున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలోనే నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సంబంధిత కాంట్రాక్టర్కు బూరుగువాడ, కణతల బంధ, దబ్బ మామిడి గ్రామస్తులు తెలియజేసిన పట్టించుకోకుండా రహదారి నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఈ అసంపూర్తి  రహదారి నిర్మాణం చేపట్టారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ప్లాంట్లో తయారు కావలసిన మెటీరియల్, నిర్మాణ స్థలంలోనే హ్యాండ్ మిక్సర్ తో కలిపారని దీనివల్లే తారు రోడ్ లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి నిర్మాణ సమయంలోనే పెన్ పవర్ దినపత్రికలో పలు కథనాలు వెలువడ్డాయని కాంట్రాక్టర్,ఇంజనీరింగ్ అధికారులు గానీ పట్టించుకోక పోవడం వల్లే తారు రోడ్డుపై గడ్డి మొలిచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అసంపూర్తి రహదారి నిర్మాణాన్ని ఎప్పుడు చేపడతారో ఏలిన వారికే తెలియాలని ఆయా గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల