యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి:ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వర రాజు

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 10: ఈనెల 12 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన యువత పోరు అనే కార్యక్రమం పాడేరు శాసన సభ్యులు అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం సారథ్యంలో ఉదయం 09:00 గంటలకు పాడేరు క్యాంప్ కార్యాలయం నుండి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్నారు.అదేవిధంగా వైఎస్ఆర్ సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.కాIMG-20250310-WA0810 వున ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు,పార్లమెంట్ సభ్యులు,ఎమ్మెల్సీ,మాజీ పార్లమెంట్ సభ్యులు,మాజీ శాసన సభ్యులు,రాష్ట్ర మరియు జిల్లా నియోజక వర్గ అనుబంధ విభాగాల నాయకులు.జడ్పీటీసీ లు మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ లు,ఎంపీటీసీలు సర్పంచులు,సీనియర్ నాయకులు,వార్డు సభ్యులు, విద్యార్థులు,నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు పిలుపునిచ్చారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Related Posts

Advertisement

LatestNews