అంబరాన్నంటిన ఉగాది సంబరాలు నూతన వస్త్రాలతో చిన్నారుల సందడి గ్రామాల్లో పంచాంగ శ్రవణాలు ఏరువాక చేపట్టిన రైతన్నలు భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

అంబరాన్నంటిన ఉగాది సంబరాలు  నూతన వస్త్రాలతో చిన్నారుల సందడి  గ్రామాల్లో పంచాంగ శ్రవణాలు  ఏరువాక చేపట్టిన రైతన్నలు  భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

పెద్దాపురం,

క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వేకువ నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి కుటుంబమంతా ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తిని ఆనందం పొందారు. గ్రామ పురోహితుల సూచనల మేరకు రైతులు ఏరువాక చేపట్టి నూతన పంట సాగుకు శ్రీకారం చుట్టారు. అలాగే రైతుల కుటుంబ సభ్యులు వారి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. దేవాలయాలు, గ్రామ కూడళ్లలో పురోహితులు నూతన పంచాంగ శ్రవణాన్ని చేశారు. గ్రామాల్లోని దేవాలయాలకు గ్రామస్థులు కుటుంబ సభ్యులతో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి తెలుగు సంవత్సరానికి స్వాగతం పలికారు. పట్టణ ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు, నూతన వాహనాలు, బంగారు వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి