అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా
అమలాపురం
చంద్రబాబు చౌక్ బారు రాజకీయాలు చేస్తున్నాడు
ఆనందరావు చాలెంజ్ విసురుతున్నా నిరూపించు
మీడియా సమావేశంలో విశ్వరూప్ సవాల్
గురువారం అమలాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పై చేసిన విమర్శలకు విశ్వరూప్ కౌంటర్ ఇచ్చారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాను ఒక్క అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలనుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి ఎవరిని తీసుకోలేదు అన్నారు. తనపై ఆరోపణలు చేసిన అమలాపురం టిడిపి అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు నేను అవినీతి చేసినట్లు అయితే అది నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఆనందరావు అవినీతి మరకలు నాకు పూసే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు నాయుడు చౌక్ గారు రాజకీయాలు చేస్తున్నాడు అన్నారు. ఆనందరావుకు చాలెంజ్ విసురుతున్న నిరూపించు అని సవాల్ విసిరారు.
