అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన పలువురు
By Admin
On
వై. రామవరం,
పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలను, ఆయన సేవలను విద్యార్ధులకు పలువురు వక్తలు వివరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, నవభారత రాజ్యాంగ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు రాకపోవడంతో అంబేద్కర్ జయంతిని మర్చిపోయారని చెప్పక తప్పదు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న ఉద్యోగులు జయంతిని స్మరించుకోకపోవడం విచిత్రంగా ఉందని పలువురు అంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, నాయకులు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
