వానపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు

వానపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు

కొత్తపేట

వానపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ బండారు రాజా ( సత్తిరాజు ) , దేవస్థానం చైర్మన్ కామిశెట్టి అమ్మన్న, బండారు సుబ్బారావు ,జిల్లా ఉపాధ్యక్షులు సాక జానకిరామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కులానికో, మతానికో చెందిన వారు కాదని, బడుగు ,బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ,ఆయన భారతజాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి అని ,ప్రపంచ మేధావి అని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే భాగ్యం కలగడం అదృష్టంగా భవిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండర్ శ్రీనివాస్ ,షేక్ యాకోబు, డాక్టర్ బాబు, బండారు కన్నబాబు, గుబ్బల నాగరాజు,కంచుస్తంభం బుజ్జిబాబు ,ఉండ్రాజు వరపు సత్యనారాయణ ,అడపా ప్రసాద్ ,నరహరిశెట్టి సాయిబాబు ,గొల్లపల్లి ఆనంద్ కుమార్, తాడాల బాబురావు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల