వైసిపి పథకాలతో పేదరికం దూరం ఎన్నికల ప్రచారంలో సుకీర్తి

వైసిపి పథకాలతో పేదరికం దూరం ఎన్నికల ప్రచారంలో సుకీర్తి

జానగరం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో  పేదరికం తగ్గిందని వైసిపి యువ నాయకుడు జక్కంపూడి గణేష్ సతీమణి సుకీర్తి  అన్నారు. మంగళవారం రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం గ్రామంలో వైసీపీ నాయకులతో కలిసి  ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదరికం శాతం తగ్గిందని సంక్షేమ పథకాలను పేదలు ప్రతి ఒక్కరికి అందేలా వాలంటీర్ల ద్వారా ఇంటికి చేరవేశారని, అదేవిధంగా పింఛన్లు పంపిణీ ప్రతి ఇంటికి వెళ్లి అందించారన్నారు. రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చెయ్యిని అభివృద్ధి కార్యక్రమాలు జగన్ చేశారని పాఠశాలల అభివృద్ధి, ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం ఇంకా అనేక రకాల కార్యక్రమాలతో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశారన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Tags:

About The Author

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,