బలహీనవర్గాల ఆశాజ్యోతి పూలే

బలహీనవర్గాల ఆశాజ్యోతి పూలే

కాజులూరు

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే  మైనార్టీ బీసీ సంఘం నాయకుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు.గురువారం  జ్యోతిరావు పూలే 197వ జయంతి  కార్యక్రమాన్ని పురష్కరించుకుని ద్రాక్షారామం  మసీద్ సెంటర్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలు కు ఆయన  పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే పాత్ర కీలయం అని ఆయన గుర్తుచేశారు.కుల వ్యవస్తను రూపుమాపేందుకు ఆయన ఎంతో కృషిచేశారన్నారు.చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావుపూలే అని కొనియాడారు.స్త్రీల కోసం విద్యాలయాలను ప్రారంభించిన తొలి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారని గుర్తుచేశారు. అస్పృశ్యతా నిర్మూలనకు ఆయన నిరంతరం శ్రమించారన్నారు. భార్య సావిత్రీ బాయి పూలే తో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్ధులకు విద్యాభ్యాషం నేర్పించిన మొదటి పంతులమ్మ అన్నారు.పూలే జయంతిని ప్రభుత్వ శెలవు దినంగా ప్రకటించాలని  యాట్ల డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కలిదిండి వెంకట సుబ్బారావు,కొసన కామేశ్వరరావు, మేడిశెట్టి శ్రీనివాస్, యాట్ల రోజా రాణి,కె.సంజీవి, కాటే కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags: #news

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల