కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్..
pure-andhra-pure-divas-in-collectorate
కలెక్టరేట్ ను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి
ఉద్యోగులందరూ భాగస్వాములు కావాలని పిలుపు
పారిశుధ్య కార్మికునికి దుస్సాలువతో సత్కారం
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
కురుపాం / పార్వతీపురం,పెన్ పవర్, ఫిబ్రవరి 15 :
పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగింది. ప్రతి రోజూ వివిధ పనుల కొరకు అధిక సంఖ్యలో ప్రజలు కలెక్టరేట్ కు వస్తుంటారని, అటువంటి వారికి ఆహ్లాదకర వాతావరణం కనిపించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాంగణంలో గల పిచ్చి మొక్కలను శుభ్రం చేసి, అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మన ఇంటి పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో అంతే పరిశుభ్రతతో కార్యాలయ పరిసరాలను ఉంచాలని, కలెక్టరేట్ ప్రాంగణమే కాకుండా, ప్రతి కార్యాలయ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పారిశుధ్య విధుల్లో విశేష సేవలు కనబరచిన పారిశుధ్య కార్మికుడు జలగొడుగుల చిరంజీవికి కలెక్టర్ ఈ సందర్బంగా దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం పారిశుధ్య కార్యక్రమంపై జేసీకి కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక, జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, కెఆర్ ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రా రెడ్ది,మునిసిపల్ కమిషనర్ సిహెచ్. వెంకటేశ్వర్లు,కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.