జూలై 18 నుండి 28వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు

జనసైనుకులు పిలుపు

జూలై 18 నుండి 28వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు

 పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ జనసేన  పార్టీ  ఐటీ కోఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కేంద్ర ఆదేశాల మేరకు 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 18 నుండి 28వ తేదీ వరకు ఒక పండగ లా జరుగుతుందని అన్నారు. క్రియాశీలక సభ్యత్వం కావాలనుకునే వారు, క్రియాశీల సభ్యత్వం రెన్యువల్ కొరకు రూ.500 చెల్లించాలని అన్నారు. జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నామన్నారు. నేడు మనం కట్టే 500 రూపాయలు రేపు మన కుటుంబానికి 5 లక్షల రూపాయల భద్రతను & , భరోసాను కల్పిస్తుందని ఇది దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా తమ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు భరోసానిస్తూ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. క్రియాశీలక సభ్యుడు పార్టీ ఏ సమావేశానికి గాని, రోడ్డుపై నిరసన కార్యక్రమానికి గాని పిలుపునిచ్చినాతప్పనిసరిగా హాజరుకావాలని, అటువంటి సభ్యులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే వారికి భరోసాను కల్పిస్తూ ఆసరాగా ఉండేందుకు ఏదైనా పార్టీ ఉందంటే అది జనసేన పార్టీయేనని అన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పపార్టీ తరపున పోటీ చేసేందుకు అర్హతగా తప్పనిసరి క్రియాశీలక సభ్యులుగా ఉండాలని, ఆ క్రియాశీలక సభ్యుడు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధి విధానాలని చెప్పగలుగుతాడాని అన్నారు. ఇప్పటి వరకు 5 లక్షల సభ్యత్వాలు ఉండగా దాన్ని 10 నుండి 15 లక్షల సభ్యత్వాలు అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు.

IMG-20240719-WA0013

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు