పెట్రోల్ బంకు ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా

పెట్రోల్ బంకు ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేయాలని అందిన దరఖాస్తు

రికార్డులను పరిశీలించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా

19
కొమరోలు పెన్ పవర్ జూలై 18: 

కొనుగోలు పట్టణానికి ఉత్తరం వైపున వైయస్సార్ జిల్లా కడప అమరావతి హైవే పక్కన నూతనంగా పెట్రోల్ బంకు ఏర్పాటు చేయుటకు గల స్థలాన్ని గురువారం మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు కొమరోలు పట్టణానికి చెందిన దేవర రమేష్ ఎడమ కళ్ళు ఇలాక లోని 21 సర్వే నెంబర్లు ఒక ఎకరా 93 సెంట్లు రైతు వద్ద వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు సదరు భూమిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయుటకు నిర్ణయించుకోగా వ్యవసాయ భూమిగా ఉన్న సదరు పొలాన్ని వ్యవసాయేతర భూమిగా మార్పు చేయాలని కోరుతూ దేవర రమేష్ సబ్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు ఆ మేరకు మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం కొమరోలు సమీపంలో గల వ్యవసాయ భూమిని అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. 81 సర్వే నెంబర్ లోని ఒక ఎకరా 93 సెంట్ల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేసేందుకు  ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన చలానాలు చెల్లించారని కొమరోలు తాసిల్దార్ మల్లికార్జున నాయుడు సబ్ కలెక్టర్ కు వివరించారు. అందుకు సంతృప్తి చెందిన సబ్ కలెక్టర్ సదరు వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా మార్పు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో ఎడమ కళ్ళు విఆర్ఓ ఆర్వి రమణ , సచివాలయం సర్వేయర్, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల