మాజీ సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన యస్. సి. వి నాయుడు

మాజీ సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన యస్. సి. వి నాయుడు

శ్రీకాళహస్తి

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలను శనివారం  యస్. సి. వి నాయుడు  ఆధ్వర్యంలో ఆయన నివాసంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులుతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని, రాబోయే ఎలక్షన్ లో టిడిపిని అఖండ మెజారిటీ తో గెలిపించి, పుట్టినరోజు కానుక ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, జై టిడిపి, జై చంద్రబాబు నాయుడు, జై యస్.సి.వి నాయుడు అంటూ నినాదాలు చేసారు. అనంతరం కేక్ కట్ చేసిన యస్.సి.వి నాయుడు  నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేసారు. తదనంతరం మిఠాయిలను పంచారు.

Tags:

About The Author

Related Posts