ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు

ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు

ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, వైజాగ్ పోలీసుల గాంధీ గిరి

 ట్రాఫిక్ పోలీసులతో కలసి ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన

నగరంలో మూడు చోట్ల ఎవేర్ నెస్ క్యాంప్స్ 

వాహన చోదకులకు ఫ్రీ హార్ట్ హెల్త్ చెకప్ కూపన్ల పంపిణీ

ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సామాజిక భాద్యతగా ఆసుపత్రి యాజమాన్యం పలు సామాజిక సేవా, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రహదారి భద్రత, నియమాలు, ప్రమాదాల నివారణపై నగర ట్రాఫిక్ పోలీసు విభాగంతో కలసి ఓమ్ని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ప్రజలకు, వాహన చోదకులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది .

IMG-20241110-WA0017

 

సిరిపురంలోని వాల్టేరు క్లబ్, రామ్ నగర్ లోని నేతివిందు రెస్టారెంట్ ఎదురుగా, జగదాంబ జంక్షన్ క్లాక్ టవర్ ఎదురుగా మూడు చోట్ల గాంధీ గిరి పేరిట
అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.

IMG-20241110-WA0016

 

ఓమ్ని ఆసుపత్రి సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులతో కలసి అటువైపుగా వెళుతున్న వాహన చోదకులకు హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ఆవశ్యకత, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, పరిమితికి మించిన  ప్రయాణికులతో వెళ్లడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే అనార్ధాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబందనలు తూ.చ. తప్పకుండా పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు.

IMG-20241110-WA0015

విశాఖలో గత 11 ఏళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఓమ్ని హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తున్నాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో నిపుణులైన వైద్య బృందం అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నారు. క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపా డుతున్నారు నిపుణులైన వైద్యులు,అత్యాధునిక వైద్య పరికరాలు, అంకిత భావంతో కూడిన పారామెడికల్ సిబ్బంది,

IMG-20241110-WA0020


ఆధునిక వసతులతో రోగి ఆరోగ్య సంరక్షనే ప్రధాన లక్ష్యంగా ఓమ్ని హాస్పిటల్స్ వైద్య సేవలందిస్తున్నాయి. ట్రాఫిక్ ఎవేర్ నెస్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ఉచితంగా అందించే హార్ట్ హెల్త్ చెకప్ కూపన్ లను వాహన చోదకులకు పంపిణీ చేశారు. ఈ కూపన్ ల ద్వారా ఉచితంగా కన్సల్టెషన్, గుండె ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ట్రాఫిక్ అవేర్ నెస్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. కార్యక్రమంలో ఓమ్ని ఆసుపత్రి IMG-20241110-WA0018  ప్రతినిదులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల