నిస్వార్థ సేవకులుగా ఉండాలి

నిస్వార్థ సేవకులుగా ఉండాలి

తాడేపల్లిగూడెం

రాజకీయాల్లోకి వచ్చినవారు నిస్వార్థ సేవ చేయాలని తాడేపల్లిగూడెం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా జగన్ పార్టీలో ఉండలేరని అన్నారు. స్థానిక బొలిశెట్టి నివాసం వద్ద ఆరో వార్డ్ ఇంచార్జ్ ఎం. నాగ వెంకటప్రసాద్ ను జనసేన లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేసిన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే  పట్టించుకోలేదని అన్నారు. పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదని  విమర్శించారు. పవన్ కళ్యాణ్ నిస్వార్ధ ప్రజాసేవకు, ఆయన విధానాలకు ఆకర్షితులై జనసేనలోకి రావడం అభినందించాల్సిన విషయమన్నారు. జగన్ వెంట నడిచే  నాయకులంతా కుటిల రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు  కుదేలైపోయాయని తెలిపారు.‌ ప్రజలకు 10 రూపాయలిచ్చి  వంద రూపాయలు లాక్కుంటున్నారని ఆరోపించారు. తాను ఇచ్చేవి మాత్రం చెప్పుకుంటూ దోచేవి, లాక్కునేవి చెప్పడం లేదన్నారు. ప్రజలు వాటిని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా  మద్దుల నాగ వెంకట ప్రసాద్ తోపాటు  
గొర్ల దుర్గారావు,
వేగిరాజు రామచంద్ర రాజు, ఆది కొండలరావు,
నారిన ఏడుకొండలు,
సోమశేఖర వర్మ, తదితరులు పార్టీలో చేరారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల