కలిసికట్టుగా పనిచేయాలి

కలిసికట్టుగా పనిచేయాలి

తాడేపల్లిగూడెం

రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా అందరూ పని చేయాలని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు రాబోయే నెల రోజుల్లో  కలిసికట్టుగా పనిచేసే  కూటమి జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. స్థానిక గొర్రెల సూరన్న కాంప్లెక్స్ లో శనివారం పట్టణంలోని 13 నుంచి  25 వార్డుల బూత్ ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ భేషజాలు, పార్టీల తారతమ్యం లేకుండా అంతా బాధ్యత వహించి పార్టీ గెలుపునకు పనిచేయాలని కోరారు. వైసీపీ నుంచి వచ్చే ప్రలోభాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని కోరారు.  ఇన్చార్జిలందరికీ స్వేచ్ఛనిస్తున్నామని,  కింది స్థాయి కేడర్ ని కలుపుకొని వెళ్లి  పార్టీ విజయానికి బాటలు వేయ్యలని కోరారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి మాట్లాడుతూ  కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు  బాధ్యత తీసుకోవాలని కోరారు . ఒకరిపై ఒకరికి  ఎలాంటి భేద భావాలు పెట్టుకోకుండా నెల రోజులు ఒక యుద్ధంలా పనిచేయాలని కోరారు . దానికి తాను సైన్యాధ్యక్షుడిగా ఉంటానని చెప్పారు . బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రాష్ట్రంలో జగన్ బొమ్మ వేసి వారు ప్రచారం చేసుకుంటున్నారని  వాటిని ప్రజలకు అర్థమయ్యే విధంగా కార్యకర్తలు నాయకులు  ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల