సిటీ కళాశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు
On
సిటీ కళాశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్ పెన్ పవర్ ఫిబ్రవరి 19:
ఎబివిపి ఆధ్వర్యంలో సిటీ కళాశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి కళాశాల అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ ధర్మ పరిరక్షకుడు అని, అఖండ భారతావనిని ఏకం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడు అన్నాడు. అలాగే మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి చరిత్రపై అక్షరాలు మొలిపించాడు అనీ, ఆయన ఎందరికో స్పూర్తిదాయకం అనీ అన్నారు. కార్యక్రమంలో అనిల్ , అక్షయ్, అరవింద్ రెడ్డి, దుర్గ, సాకేత్, ప్రశాంత్,మునిష్, శ్రీను , తరుణ్, అంజి మరియు కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఎబివిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
