దర్శకుడు తేజ ఆవిష్కరించిన "" పోలీస్ వారి హెచ్చరిక "" టైటిల్ లోగో

దర్శకుడు తేజ  ఆవిష్కరించిన

అభ్యుదయ  దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో   తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై
బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న 
"" పోలీస్ వారి హెచ్చరిక ""
సినిమా  టైటిల్ లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్ డైరెక్టర్  తేజ మంగళవారం రోజున  ఆయన కార్యాలయం లో ఆవిష్కరించారు....!

ఈ సందర్భంగా  దర్శకుడు తేజ
మాట్లాడుతూ  "" ఏ సినిమా కైన  ప్రేక్షకులను ఆకర్షించేది , వారిని థియేటర్ ల వద్దకు 
నడిచేలా చేసేది  టైటిల్ మాత్రమే అని ...
ఈ  "" పోలీస్ వారి హెచ్చరిక""
అనే టైటిల్ కూడా  అలాంటి
శక్తివంతమైన  మాస్  టైటిల్
అని , ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు కొంగు బంగారం గా
మారి విజయాన్ని చేకూరుస్తుందని "" పేర్కొన్నారు....!
 "" విజయాలను  సెంటిమెంట్ గా  మలుచుకున్న  సక్సెస్ ఫుల్ 
దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం  మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని , దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని   నిర్మాత  బెల్లి జనార్థన్
పేర్కొన్నారు....!
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ
""    సినిమా  షూటింగ్  రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ..."  తెలిపారు...!
 సన్నీ అఖిల్  , అజయ్ ఘోష్ ,
రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం తదితరులు ఈ చిత్ర తారాగణం ....!
కాగా..
కెమెరా : నళినీ కాంత్  , సంగీతం : గజ్వేల్ వేణు ,
ఎడిటర్  : శర్వాణి శివ ,
పబ్లిసిటీ & స్టిల్స్ : శ్రీకాంత్ భోక్రె 
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హనుమంతరావు...,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :
ఎన్ . పి . సుబ్బరాయుడు ,
నిర్మాత : బెల్లి జనార్థన్ ,
రచన ,దర్శకత్వం : బాబ్జీ

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల