పుష్ప 2 ర్యాంపేజ్.. మరోసారి సోషల్ మీడియా కింగ్ బన్నీ ఆన్ డ్యూటీ

పుష్ప 2 ర్యాంపేజ్.. మరోసారి సోషల్ మీడియా కింగ్ బన్నీ ఆన్ డ్యూటీ

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న స్టార్ హీరోస్ లో పాన్ ఇండియా మార్కెట్ లో తన సొంత బ్రాండ్ తో భారీ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరి పుష్ప 1 తో పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ మార్కెట్ ని ప్రూవ్ చేసుకున్న తాను ఇప్పుడు “పుష్ప 2” తో మరింత గ్రాండ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అయితే సినిమా పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ భారీ క్రేజ్ ఉంది.ఎన్నో సినిమాలలో తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రెజెంట్ చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ని తాను సొంతం చేసుకున్నాడు. దీనితో పాలొవర్స్ లో కానీ యూట్యూబ్ వ్యూస్ లాంటి వాటిలో కానీ అల్లు అర్జున్ తనకి తానే సాటి అనేలా నిలిచాడు. ఇప్పుడు తాజాగా పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ ‘పుష్ప పుష్ప’ లిరికల్ ని మొత్తం 6 భాషల్లో రిలీజ్ చేయగా దీనికి ఇప్పుడు ఇండియా లోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ వచ్చేసింది.దీనితో బన్నీ మరోసారి సోషల్ మీడియా కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఇంకా ఇందులో హిందీలో వ్యూస్ డామినేటింగ్ గా ఉండడం విశేషం. మొత్తానికి అయితే మరోసారి అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ల మ్యాజికల్ మ్యూజిక్ కాంబో మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేయడం మొదలు పెట్టారని చెప్పాలి.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల